జీనోమ్ పత్రి మరియు మీరు

త్వరిత పరిశీలన:

ప్రపంచంలోని వేగవంతమైన మహిళలలో ఒకరైన ఫ్లోరెన్స్ జాయ్నర్, ఒకసారి ఇలా అన్నారు, “ఒక కండరం కారు లాంటిది. అది సరిగా పనిచేయాలంటే , మీరు దానిని ఉత్తేజ పరచాలి ”. ఆధునిక కాలపు నిశ్చల జీవనశైలిలో, ఏదైనా శారీరక శ్రమలో పాల్గొన్న సామాన్యులను చూడటం చాలా అరుదుగా కనిపిస్తుంది. వాస్తవానికి, నేటి సమాజంలో మారుతున్న జీవన శైలి వలన పురుషులు మరియు మహిళలు వారి శారీరక సమస్యలపై అవగాహన లోపించడం వలన తొందరగా వృద్ధాప్యాన్నిఆహ్వానిస్తున్నారు. మానవ జాతి శారీరక వ్యాయామం వలన జరిగే మేలును గుర్తించడం ఎప్పుడు ప్రారంభిస్తుంది? మన భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే శారీరక సంబంధిత రుగ్మతల ఫై అవగాహన ఎలా వస్తుంది? వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం సందర్భోచితం కాదా?

ప్రకృతి మరియు మానవ శరీర స్వభావానికి మధ్య వున్నసూక్ష్మమైన తేడాలను అర్థం చేసుకోవడం అనేది క్లిష్టమైన ప్రక్రియ . ఒకరి శరీరం  ఆరోగ్యంగా మరియు దృడంగా ఉండటానికి, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి లేదా మనం చెప్పినట్లుగా, దాని యొక్క జన్యుపరమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది, ఒకరి శరీరానికి అవసరమైన ఖచ్చితమైన ఆహారం మరియు అవసరమైన శిక్షణను ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. మనలో భాగమైన జీవసంబంధమైన మన డిఎన్‌ఎను తెలుసుకోవడం, కొత్త జీవితం ఉద్భవించినప్పటి నుండి జీవితం ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆహారాలు, వ్యాయామాల సమయం మరియు వ్యవధి మరియు జీవన విధానం యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. సంక్షిప్తంగా, జన్యువులు మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. చురుకైన జీవనశైలిని అవలంబించడం మరియు శారీరక దృత్వంతో పెంపొందించుకోవడం అనేది ఒకరి ఆరోగ్యానికి ముఖ్యమైన విషయం.

జీనోమ్ పత్రి – ఒక అవగాహన:

జీనోమ్ పత్రి అనేది ఒక జన్యు పరీక్ష. ఇది మన జన్యు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు శరీరానికి అవసరమైన సరైన ఆహారం, శారీరక వ్యాయామాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీనోమ్ పత్రి  ఆరోగ్య నిర్వహణ యొక్క కొత్త నమూనాను, వ్యక్తిగత జన్యుశాస్త్రాలను ఉపయోగించుకుంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో వ్యాధి ప్రమాదాన్ని గుర్తించడానికి మరియు అనేక ప్రాణాలను రక్షించే ఔషధాలకు శరీర ప్రతిస్పందనలను ( సమర్థత, జీవక్రియ, ప్రతికూల ప్రతిచర్యలు) కనుగొనడానికి జన్యు సమాచారాన్ని ఉపయోగించే ఒక పరీక్ష . ఈ పరీక్ష ద్వారా వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా వ్యాధిని లేదా పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా, జీనోమ్ పత్రి అనేది జీవితంలో ఒకసారి, నొప్పిలేకుండా చేయించుకోకలిగిన సరళమైన లాలాజల-ఆధారిత పరీక్ష. ఇది మీ జన్యు పదార్ధాన్ని(DNA) వైవిధ్యాల కోసం స్కాన్ చేస్తుంది. మన శరీర జన్యు నిర్మాణం  ఎలా నిర్మించబడిందనే దానిపై పరమాణు స్థాయికి అంతర్-దృష్టిని ఇస్తుంది. పరీక్ష ఫలితాలను విశ్లేషించడంలో ఆ వ్యక్తి యొక్క జాతి మరియు జనాభా భారీ పాత్ర పోషిస్తుంది..

జీనోమ్ పత్రి ఫలితాలు మీ రోగనిరోధక శక్తి యొక్క బలహీనతలు, నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులకు జన్యు సిద్ధత, ఔషధ సామర్థ్యం వంటివి ముందస్తుగా తెసులుకోవడంలో సహాయపడతాయి. అందువల్ల ఆహారం, జీవనశైలి, విద్యా మరియు భావోద్వేగాలకు మద్దతుగా సమీక్షను పొందటానికి జన్యు సలహా సిఫార్సు చేయబడింది. ఈ జన్యు సలహా నుండి వచ్చిన నివేదిక వ్యాధులు, లక్షణాలు, వారసత్వ పరిస్థితులు మరియు ఔషదాల గురించి వివరిస్తుంది, మరియు చురుకైన జీవనశైలిని అనుసరించటంలో సహాయపడుతుంది.

సరళంగా చెప్పాలంటే, జన్యు మార్కర్ల ఉనికి లేదా వ్యక్తి సాధారణ జనాభాకు సంబంధించిన  ఒక నిర్దిష్ట పరిస్థితికి బేస్‌లైన్ రిస్క్, మీడియం రిస్క్ లేదా హై రిస్క్‌లో ఉందా అని నిర్వచిస్తుంది. ఈ కారకాలు బహుళ-కారకమైనవి, మరియు అర్థం చేసుకున్నప్పుడు, పర్యావరణ కారకాలను ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకోవడం మరియు జీవనశైలిని నిర్వహించడానికి మరియు మొత్తం ఆరోగ్య నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మా నివేదిక సాంకేతికంగా మరియు స్పష్టంగా ఉన్నందున, కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవలసిన అవసరం వుంది:

  • ఈ నివేదిక కేవలం జన్యు సంకేతాల ఆధారంగా రూపొందించబడినది
  • ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితి పట్ల జన్యు సిద్ధత మాత్రమే నివేదించబడుతుంది.
  • మా నివేదిక ఒకరి ఆరోగ్య స్థితిని జన్యు స్థాయిలో అంచనా వేయడం మరియు ఒకరి ఆరోగ్యానికి సరైన ఎంపికలు చేయడంపై దృష్టి పెట్టింది.

మీ జన్యు ప్రొఫైల్ యొక్క చిత్రం:

ఆరోగ్య సంరక్షణ యొక్క భవిష్యత్తు “నివారణ జన్యు పరీక్ష”లో ఉంది మరియు క్రియాశీల జీవనశైలి కంటే చురుకైన జీవనశైలికి అనుగుణంగా దృష్టి సారించబడుతుంది. మా నాన్-ఇన్వాసివ్ జన్యు పరీక్షతో, మీరు ఈ క్రింది వాటిని పొందుతారు.

  • జన్యు సిద్ధత: అనేక దీర్ఘకాలిక మరియు ప్రాణాంతక వ్యాధులకు ఏదైనా ప్రమాదాన్ని కనుగొనడంలో మీకు ముందస్తు గుర్తింపును నిర్ధారించడానికి సహాయపడుతుంది.
  • లక్షణాలు: సాధారణ / జీవనశైలిలో వైద్య ఫలితం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేసే జన్యు లక్షణాలు మీకు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
  • ఔషధ ప్రతిస్పందన: ఔషధాలకు ప్రతిస్పందన, ఆదర్శ ఔషధ పద మోతాదు మరియు ఔషధ పద సున్నితత్వాన్ని గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.
  • వారసత్వ పరిస్థితులు: వాహక స్థితి మరియు భవిష్యత్ తరాలకు బదిలీ చేయగల పరిస్థితుల గురించి వివరాలను తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
  • జన్యు సలహా: నివేదికలను విశ్లేషించడానికి మరియు కుటుంబ ఆరోగ్య చరిత్ర, వైద్య చరిత్ర మరియు జీవనశైలితో పరస్పర సంబంధం కలిగి ఉండటానికి శాస్త్రీయ నిపుణులు మీకు సహాయం చేస్తారు.
  • ఆహారం మరియు శారీరక వ్యాయమ సలహా : మీ DNA మరియు వైద్య చరిత్ర నుండి సేకరించిన నిపుణుల ఆహార సలహా మరియు ఇతర సమాచారాన్ని తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

మ్యాప్మైజీనోమ్ గురించి:

  • 19 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం మరియు జన్యుశాస్త్రంలో నిరూపితమైన శాస్త్రీయ నైపుణ్యం.
  • డేటా గోల్డ్ స్టాండర్డ్ డేటాబేస్ ద్వారా ధృవీకరించబడింది.
  • బయో-ట్రాకర్ లాబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LIMS) ద్వారా వ్యక్తిగత సమాచారగోప్యత పాటిస్తుంది.
  • సరైన అభ్యాససంబంధిత మార్గదర్శకాలు మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోంది.
  • వైవిధ్యమైన ఆరోగ్య ప్రమాదాలను విశ్లేషించడానికి మరియు వివరణాత్మక జన్యు సలహా అందిస్తోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఆరోగ్య నిర్వహణ యొక్క నమూనాను మలచడంలో జీనోమ్ పత్రీ కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఆరోగ్య సంబంధిత దినచర్యను ప్రారంభించే ముందు ఒకరి వ్యక్తిగత సామర్ధ్యం అర్థం చేసుకోవడానికి మరియు చురుకైన జీవనశైలిని అవలంబించడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష వలన ఎటువంటి దుష్ప్రభావములు వుండవు.