న్యూట్రిజెనోమిక్స్ – వ్యక్తిగతీకరించిన ఆహారానికి మార్గం

ప్రస్తుతం మనము కొత్త విషయాలను తెలుసుకోవడానికి మరియు కొత్త సాంకేతికతలును కనిపెట్టడానికి నిరంతరం పరుగు పెడుతున్న కాలంలో జీవిస్తున్నాము. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాలతో విస్తరిస్తూ, మానవజాతి గతంలో కంటే మునుపెన్నడూ లేనివిధంగా వాణిజ్య జీవన విధానం వైపు పరుగులుతీస్తోంది. ప్రిస్క్రిప్షనే పోషణ పదార్ధంగా మారిన ఈ తరుణంలో వాణిజ్య పరిశ్రమరంగాల నుండి వచ్చిన ఆహారంలో మంచి నుండి చెడును వేరుచేయవలసిన బాధ్యత మనపై ఉంది. ఆహారవిలువల గురించి మనం ఎంతగానో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

మన పూర్వీకులకు, వారి ముందు తరాలకు మానవ ఆరోగ్యంపై, ఆహారం మరియు జన్యువుల మధ్య గల సంబంధాలపై పూర్తి అవగాహన ఉంది. ఇక్కడే న్యూట్రిజెనోమిక్స్ చిత్రంలోకి వస్తుంది. ఇది జన్యువులు మరియు పోషకాల మధ్య సంబంధాలపై జీవశాస్త్రాల అనువర్తనానికి సంబంధించినది. మీ జన్యు పదార్థం (DNA) ప్రకారం మీ ఆహారాన్ని అనుకూలీకరించడానికి న్యూట్రిజెనోమిక్స్ సహాయపడుతుంది. ఒక వ్యక్తి పెరుగుతున్న భౌగోళిక స్థానం అతని / ఆమె రోజువారీ ఆహార ఎంపికను ప్రభావితం చేయగలదు కానీ పరమాణు స్థాయిలో, మన జన్యు పదార్థమే ప్రతిదీ నిర్దేశిస్తుంది.

న్యూట్రిజెనోమిక్స్ వల్ల క్రింది  ప్రయోజనాలు ఉన్నాయి:

ఆహార ప్రతిచర్యలు: న్యూట్రిజెనోమిక్స్ ద్వారా, మీరు తీసుకునే ఆహారాలకు మీ శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్ష ప్రతికూలచర్యల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

తినే ప్రవర్తన: మీ జన్యువులు మీరు భుజించే ఏ పదార్థాల వల్ల పూర్తి అనుభూతి చెందుతాయో (ఉదాహరణకు:చాక్లెట్లు మరియు రుచికరమైన పదార్ధాలు తినాలనే కోరిక) అలాగే వేటిపై వ్యతిరేకత వుందో (ఉదాహరణకు:గోధుమ ఉత్పత్తులపై చిరాకు) వంటి మరెన్నోఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలుగుతారు. 

జీవక్రియ కారకాలు: మీ ఆహారం, రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా, మీరు జీవనశైలి సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఏమాత్రం వుందో తెలుసుకోగలుగుతారు. 

పోషక అవసరాలు: మీ ఆహారాలలో ఏవిధమైన విటమిన్లు మరియు ఖనిజాల ఆవశ్యకత వుందో మీరు తెలుసుకోగలుగుతారు.

మనం క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం, పోషకాలు మన శరీరానికి శక్తిని మరియు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మీ జన్యు పదార్ధం, గుండె ఊపిరితిత్తుల పనితీరు, జీవక్రియ మొదలైనవి మీ వ్యక్తిగత స్వభావానికి ప్రత్యేకమైనవి. మీ డిఎన్ఏ, మీరు తినవలసిన ఆహారాలకు ఒక నిర్దిష్టమైన, ఒక ప్రత్యేకమైన మరియు ఆదర్శవంతమైన ఆహార ప్రణాళికను సృష్టిస్తుంది. న్యూట్రిజెనోమిక్స్ “జీవనశైలి-అనుసంధాన వ్యాధుల” నివారణపై పోరాటం చేస్తుంది.

కార్పొరేట్ సైన్స్ యొక్క భిన్న వాదనల మధ్య, “అసలు న్యూట్రిజెనోమిక్ సైన్స్ ఆసక్తి పెంచుకోవడానికి అర్హమైనదా?” అనే ప్రశ్న ఉత్పన్నమౌతూ ఉంటుంది. ఈ ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, న్యూట్రిజెనోమిక్స్ గురించి కొన్ని వాస్తవాలను కింద తెలపటం జరిగింది.

  • న్యూట్రిజెనోమిక్స్, మనం ఏమి తింటామో, ఒక వ్యాధికి ఎలా స్పందిస్తామో మరియు వాటి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తుంది.
  • న్యూట్రిజెనోమిక్స్ అనేది ఒక వ్యాధి మరియు దాని పురోగతి ప్రమాదాన్ని గుర్తించడానికి ఒక పరికరంలా ఉపయోగపడుతుంది
  • న్యూట్రిజెనోమిక్స్ ఊబకాయం-మానసిక ఆరోగ్యం, పోషక పదార్ధాలు-వ్యాధుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయుటకు ఉపయోగపడుతుంది.
  • న్యూట్రిజెనోమిక్స్ వ్యక్తిగతీకరించిన ఆహార పోషణను అందించడాన్నిప్రోత్సహిస్తుంది.
  • న్యూట్రిజెనోమిక్స్ శరీరానికి అందించే ఆహార పోషకాల పరిమాణాల వివరాలను నమోదు చేయడానికి సహాయపడుతుంది.

చివరగా:

రాబోయే భవిష్యత్తులో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య సంరక్షణలో న్యూట్రిజెనోమిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ జన్యు పరీక్ష మీ జన్యు ప్రొఫైల్ ఆధారంగా మీకు ఏ ఆహారాలు సరిపోతాయో, అలాగే మీ ఆరోగ్యము, బరువు నిర్వహణ లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి సహాయపడుతుంది.

మ్యాప్ మైజినోమ్ మీకు ఎలా సహాయపడుతుంది?

మ్యాప్ మైజినోమ్ లో, ఆరోగ్యం, పోషణ, ఫిట్నెస్ మరియు ఔషధాన్ని వ్యక్తిగతీకరించడానికి మేము ఒక సముచిత పంథాను రూపొందించాము. భారతదేశంలో వ్యక్తిగత జన్యుశాస్త్రం యొక్క మార్గదర్శకులుగా, మన జీవితాలను మార్చగల శక్తి ఆహారానికి ఉందని మేము నమ్ముతున్నాము.

మా స్క్రీనింగ్ పరీక్ష మైన్యూట్రిజీన్ తో, మీరు మీ శరీరానికి బాగా అనువైన ఆహార పద్దతులను ఎంచుకోవచ్చు. మైన్యూట్రిజీన్ మీ రోగనిరోధక శక్తి, నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులకు జన్యు సిద్ధత గురించి మీకు వివరించడమే కాకుండా, సరైన ఆరోగ్య ప్రణాళికలను ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష మీ జీవక్రియ, కొవ్వు / పిండిపదార్థాల ప్రతిస్పందన, ఆహార వ్యతిరేకత మరియు తినే ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి కూడా మీకు సహాయం చేస్తుంది.

మీ జన్యు విశ్లేషణ నుండి సేకరించిన అంతర్దృష్టులు, మా ధృవీకరించబడిన నిపుణులతో సమగ్రమైన జన్యు సలహాతో పాటు, మీకే ప్రత్యేకమైన అత్యంత వ్యక్తిగతీకరించిన సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రత్యామ్నాయంగా, మీరు మా వెబ్‌సైట్ www.mapmygenome.in ని సందర్శించవచ్చు.

ఇమెయిల్info@mapmygenome.inటోల్ ఫ్రీ నంబర్:  ౧౮౦౦  ౧౦౨ ౪౫౯౫ (1800 102 4595).