ఫార్మాకోజెనోమిక్స్ – వ్యక్తిగతీకరించిన ఔషధానికి మార్గం

త్వరిత పరిశీలన:

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మీరు చూసినట్లయితే, మానవజాతి సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతితో అతివేగంగా దూసుకుపోతోంది. పంటలను పండించే క్రమంలో సాధించిన విప్లవాత్మక మార్పులపై వ్యవసాయపరంగా, సేంద్రీయపరంగా అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తుత శాస్త్రీయ సమాజం మాట్లాడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పోషక సమతుల్యతను ఇస్తుంటే, రసాయన ఉత్పత్తులు, ఔషధాలు మానవప్రగతిని వెనుకంజ వేయిస్తున్నాయి. ఔషధాలే ఆహారంగా, చికాకు, అలజడి కలిగించే దృశ్యంగా మారిన ఈ కాలంలో, మంచి చెడుల మధ్య తేడాను గుర్తించాల్సిన ఆవశ్యకత మన మీద ఎంతగానో ఆధారపడివుంటుంది. మానవ ఎదుగుదల యొక్క ప్రతి స్థాయిలో వ్యక్తులుగా మనము విలక్షణంగా ఉన్నాము. జన్యు స్థాయిలో మనం తీసుకునే ఆహారం, ఔషధాల విషయంలో శరీరం నిర్దిష్టంగా వివిధ వాతావరణాలకు భిన్నంగా స్పందిస్తుంది.

ఔషధ చికిత్సకు ప్రతిస్పందనగా జన్యువులు చెప్పే వాస్తవాలు దాదాపు అర్ధ-శతాబ్దానికి పైగా ప్రసిద్దిగాంచాయి. మాదకద్రవ్యాలకు ప్రతిచర్యలు, దీర్ఘకాలిక మరణాలకు అతిపెద్ద కారణం. ఇవి రహదారి ప్రమాదాలు, జీవనశైలి వ్యాధుల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ, ఔషధాలు ప్రతి వ్యక్తికి భిన్నంగా పనిచేస్తాయనే ప్రాథమిక అవగాహనతో అనేక మరణాలను నివారించగలుగుతాము. ఇది మనల్ని సైన్స్ యొక్క ఒక మనోహరమైన భాగమైన ఫార్మాకోజెనోమిక్స్ వైపుకు దారి చూపుతుంది. (బన్సాల్ వి ఎట్ అల్, 2005).

పేరులో చెప్పినట్లుగా, ఫార్మాకోజెనోమిక్స్ అనేది జన్యుశాస్త్రంలో ఒక విభాగం. ఇది ఒక నిర్దిష్ట ఔషధానికి ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. ఫార్మాకోజెనోమిక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తికి సరైన ఔషధాన్ని సూచించడం , తద్వారా ఏదైనా శారీరక దుష్ప్రభావాలను తగ్గించడం. అయితే, దీనిని అమలుచేయడానికి చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. నైతిక, సామాజిక మరియు చట్టపరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఫార్మకోజెనోమిక్స్ శాస్త్రాన్ని ఒక సాధనంగా ఉపయోగించి కొత్త ఔషదాల అభివృద్ధికి ఫార్మాకో ఎకనామిక్ విశ్లేషణ, రోగనిర్ధారణ విధానాలు అన్నీ విమర్శనాత్మకంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నిర్దిష్ట ఔషధం ఎలా విచ్ఛిన్నమవుతుంది, ఎలా  ఉపయోగించబడుతుంది మరియు ఎలా విసర్జించబడుతుంది అనే వాటికి వర్తింపబడుతుంది. అనేక ఔషధాల విశ్లేషణలో, ఇది DNA మరియు వివిధ ఔషధాలకు దాని ప్రతిస్పందన పై ఆధారపడి ఉంటుంది. ఫార్మకోజెనోమిక్స్ ఖచ్చితత్వం మరియు వ్యక్తిగతీకరించిన ఔషధాన్ని సూచించడానికి ఇది ప్రధాన కారణం.

ఫార్మకోజెనోమిక్స్ యొక్క ప్రయోజనాలు:

ఫార్మాకోజెనోమిక్స్ పురాతన శాస్త్రాలైన సేంద్రీయ, ఔషధ, రసాయన శాస్త్రాలను, ప్రోటీన్లు జన్యువులు మరియు సింగిల్ ఈస్టర్ పాలిమార్ఫిజమ్‌ల సమాచారంతో మిళితం చేస్తుంది. ఇది, క్రింద పేర్కొనబడిన ప్రయోజనాలను కలిగి ఉంది.

  • ప్రారంభ దశ నుండి సురక్షితమైన మందులు
  • తగిన మోతాదులను నిర్ణయించడానికి ఖచ్చితమైన మార్గాలు.
  • సమయం మరియు సమర్థవంతమైన ధరలు
  • అధునాతన మందులు
  • తక్కువ ఆరోగ్య సంరక్షణ ఖర్చు 
  • జన్యు లక్ష్యాలను ఉపయోగించి తగిన చికిత్సలను గుర్తించే సామర్థ్యం

మెడికామ్యాప్: 

ఫార్మాకోజెనోమిక్ పరీక్ష చేయించుకునేముందు మీ జన్యువులు ఔషధాలకు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం మంచిది. ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.

  • చికిత్స కాంబినేషన్ రకాలు తెలుసుకొనుట
  • చికిత్సలో ప్రత్యామ్నాయాలు తెలుసుకొనుట
  • ఒక నిర్దిష్ట చికిత్సకు శరీరం యొక్క ప్రతిచర్యల అంచనా 
  • దుష్ప్రభావాలు ఉన్నయోలేదో తెలుసుకొనుట

గడిచిన రోజుల్లో చూసినట్లయితే, ఔషధ సామర్థ్యం, దాని శోషణ ఒక అపోహ తప్ప మరొకటి కాదు. అలాగే, ఔషధాల అమ్మకం చాలా ఎక్కువగా ఉండటం వలన, వాటి ప్రతికూల చర్యలు మరణాలకు ముఖ్య కారణాలుగా మారాయి. ఈకాలంలో ఎక్కువగా ఇచ్చే మందులు ప్రజలకు చికిత్స చేయకపోగా వాటి లక్షణాలను మాత్రమే తొలగిస్తున్నాయి అని చెప్పుకోవటం లో వాస్తవం లేకపోలేదు. ఔషధాల రకాలు గురించి తెలుసుకోవడం వలన మనం ఎన్నో ఉత్తేజకరమైన వాస్తవాలను తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం అవాంఛిత ప్రమాదాన్ని తగ్గించి, విజయవంతమైన చికిత్స అవకాశాలను పెంచి మానవ జీవితాన్ని కాపాడుతుంది. సీక్వెన్సింగ్ మరియు జన్యు పరిశోధన యొక్క విస్తరణలో సాంకేతిక పరిజ్ఞానం వలన, మీ జన్యు ప్రొఫైల్‌ను పరీక్షించుకుని అనేక ఔషధాలకు మీ శరీర ప్రతిస్పందనను అర్థం చేసుకోగలిగే అవకాశముంటుంది.

జన్యు అమరిక ఆధారంగా మీ విలక్షణమైన ప్రొఫైల్‌ను గుర్తించటానికి, ఔషధ-ప్రతిస్పందన ప్రొఫైల్‌ను విశ్లేషించే అత్యాధునిక ఫార్మాకోజెనోమిక్ పరీక్ష మా మెడికామాప్. మెడికామాప్ ఒక లాలాజల ఆధారిత పరీక్ష. ఈ పరీక్ష 99% డేటా ఖచ్చితత్వంతో పాటు FDA సిఫార్సు చేసిన ఔషధ సమ్మేళనాలతో సహా వివిధ  ఔషధాల కోసం జాగ్రత్తగా ఎంచుకున్న జన్యు గుర్తులను కలిగి ఉంది. మా ఈ వ్యక్తిగతీకరించిన నివేదిక మీ వైద్యుడికి మీ గురించి ఒక ఆలోచన ఇవ్వడమేకాకుండా, మీ శరీరానికి సరిపడని మందుల విషయాన్నీ తెలియపరుస్తుంది. ఈ పరీక్షతో, వైద్యుడు రోగికి తగిన చికిత్స ఎంపికలు మరియు ఔషధ మోతాదును సూచించ గలుగుతారు. 

మెడికామాప్ యొక్క ప్రయోజనాలు:

  • మీ జన్యువుల, ఔషధాల ప్రతిస్పందన ప్రొఫైల్ ఆధారంగా చికిత్సను ప్రతిపాదించుటలో సహాయం చేయటం
  • ఔషధ సామర్థ్యాన్ని పెంచుటయే కాకుండా, మీ చికిత్స వ్యవధిని తగ్గించటం.
  • ప్రతికూల ప్రతిచర్యల అవకాశాలను తగ్గించటం.
  • ఔషధాలకు మీ శరీర స్పందనను తెలియచేయటం. 

సరళంగా చెప్పాలంటే, ఫార్మకోజెనోమిక్స్ అనేది ఒక సాధన. ఇది గరిష్ట ప్రయోజనాలదిశగా, ఉపయోగాల దిశగా ముందంజ వేసే క్రమంలో ఉంది. ఈ పరీక్షకు ఔషధ సమర్థతలో మెరుగుదల మరియు ప్రతికూల స్పందనలను, వ్యాధి లక్షణాలకు జన్యువులకు మధ్య వున్న పరస్పర సంబంధం మరియు కొత్త ఔషధాల పరిశోధనలో లక్ష్యాలను గుర్తించడం వంటి ముఖ్య లక్షణాలు వున్నాయి. గతంలో చూసినట్లయితే, ఎక్కువ శాతం మందులు ఒక వ్యక్తిని లేదా రోగిని లక్ష్యంగా చేసుకోకుండా జనాభా స్థాయిలో గుర్తించడానికి రూపొందించబడ్డాయి. ఆ ధోరణిని తిప్పికొట్టడం ద్వారా, ఫార్మాకోజెనోమిక్స్ చికిత్స తన దృష్టిని మెరుగుపరచటమే కాకుండా, ఔషధాలను మరింత ప్రభావవంతంగా తక్కువ మోతాదుతో ఉపశమనం కలగ చేయగలుగుతుంది. వ్యాధి యొక్క బాహ్య వ్యక్తీకరణపై ఆధారపడకుండా, ఫార్మాకోజెనోమిక్ మెడిసిన్ జన్యురూపాన్ని పరిశీలించడమే కాకుండా, చికిత్స కూడా చేస్తుంది. ఔషధ ఆవిష్కరణ మరియు అభివృద్ధిలో ఫార్మాకోజెనోమిక్ అధ్యయనాలను క్రమంగా చేర్చడం వల్ల ఔషధ  అభివృద్ధికి సంబంధించిన ఖర్చులను గణనీయంగా తగ్గించగలుగుతాము. అందువల్ల, ఫార్మకోజెనోమిక్ అధ్యయనం ఉపయోగించి ఒక అధ్యయనంలో అవుట్‌లైయర్‌లపై ఉన్న ప్రభావాల వల్ల తిరస్కరణకు గురైన అనేక సంభావ్య మందులను భవిష్యత్తులో అలాగే ఉంచవచ్చు

అన్నింటినీ కలుపుకుని, ఈ వ్యక్తిగతీకరించబడిన ఔషధం అన్ని రకాల వాటాదారులను అనేక రకాల వైద్య సంరక్షణ ఎంపికలపై మునుపటి కంటే మరింత సమర్థవంతంగా నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తుందని మనం ఆశించవచ్చు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే ఆరోగ్య సంరక్షణ వనరులను ఉపయోగించడానికి చికిత్స యొక్క వ్యవస్థలను రూపకల్పన చేయటమేకాకుండా, గతంలో కంటే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అధికంగా అవసరం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, మీరు మా వెబ్‌సైట్ www.mapmygenome.in ని సందర్శించవచ్చు.  

ఇమెయిల్info@mapmygenome.inటోల్ ఫ్రీ నంబర్:  ౧౮౦౦  ౧౦౨ ౪౫౯౫ (1800 102 4595). 

ప్రస్తావనలు:

  1. Bansal, V., V. Kumar, and B. Medhi. “Future challenges of pharmacogenomics in clinical practice.” JK Science 7.3 (2005): 176-179.
  2. T P, Aneesh et al. “Pharmacogenomics: the right drug to the right person.”Journal of clinical medicine research vol. 1,4 (2009): 191-4. doi:10.4021/jocmr2009.08.1255
  3. Vogenberg, F Randy et al. “Personalized medicine: part 1: evolution and development into theranostics.” P & T: a peer-reviewed journal for formulary management vol. 35,10 (2010): 560-76.